శ్రీలంకలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీలంక తమిళుల వివాదంపై జయలలిత ఒక రోజుపాటు నిరాహార దీక్ష చేయనున్నారు. శ్రీలంకలో తక్షణ కాల్పుల విరమణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలని జయలలిత డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే అన్నాడీఎంకే పార్టీ సభ్యులు తమిళనాడులోని అన్నిజిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఇటువంటి నిరాహరదీక్షలే చేపట్టారు. శ్రీలంకలో కాల్పుల విరమణ తీసుకురావడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం, ఆ కూటమిలోని డీఎంకే విఫలం అయ్యాయని జయలలిత విమర్శించారు. లంక తమిళుల సహాయార్థం పార్టీ నిరాహారదీక్షలో భాగంగా విరాళాల సేకరణ కూడా చేపట్టింది. |