ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మతస్వేచ్ఛ దుర్వినియోగంపై పీఎం ఆందోళన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మతస్వేచ్ఛ దుర్వినియోగంపై పీఎం ఆందోళన
FileFILE
దేశంలో రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛా హక్కును ఇతర మతాలను అణచి వేసేందుకు ఓ పావులా ఉపయోగించరాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏమతాన్నైనా స్వీకరించే, ఆచరించే పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పిస్తోందని, అదే సమయంలో ఇతర మతాలను దూషించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో దేశంలో మతప్రాతిపదికన ప్రజలను వేరు చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత ఆయన తొలిసారి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా వ్యఖ్యానించారు. మిలాదున్ నబీ పండుగ సందర్భంగా తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

జనవరి నెలాఖరులో ప్రధానికి గుండె ఆపరేషన్ జరిగిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన అన్ని రకాల అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా కోలుకున్న ప్రధాని మెల్లగా తన నివాసంలో జరిగే కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అణు ఒప్పందంలో కీలక పాత్రధారి మీనన్
కూలిన బ్రిడ్జి: లాలూపై కేసు నమోదుకు ఆదేశం
వికృతరూపం దాల్చిన ర్యాగింగ్: మెడికో మృతి
ఎయిమ్స్ డైరక్టర్‌గా ఆర్.సి.డెకా నియామకం
గాంధీజీ వస్తువులను ప్రదర్శనకు ఉంచాలి
పాక్ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం: ప్రణబ్