జన్మకుండలి చూపండి, టికెట్ పొందండి. ఇది అమ్మ మాటలు. అంటే తమిళనాడులోని అఖిల భారతీయ అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం(ఏఐఏడిఎమ్‌కే) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల ఫార్ములా. తమిళనాడులో జయలలిత తన పార్టీ కార్యకర్తలకు ఎన్నికలలో పోటీ చేయడానికి ఆశించే అభ్యర్థులకు టికెట్లను ఈ విధంగా పంపిణీ చేస్తున్నారు. ముందుగా అమ్మ అభ్యర్థి యొక్క జన్మతేదీ, అభ్యర్థి పుట్టిన శుభ ఘడియలు చూసిన తర్వాతే అతను/ఆమె యొక్క ప్రజాబలం ఎంతవుందనే దానిపై వివరాలు సేకరించి పార్టీ టికెట్లను ఇస్తున్నారు. ఇదిలావుండగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేదికూడా శుభ ఘడియలను చూసుకునే అమ్మ తన కార్యకర్తలు, అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. ఎవరి జన్మ కుండలిలో గెలుపు తథ్యం అని ఉంటుందో వారికే టికెట్టు గ్యారెంటీగా దక్కనుంది. నిరుడు లోక్‌సభ ఎన్నికలలో జయలలిత పార్టీ అభ్యర్థులు ఒక్కరుకూడా గెలవకపోవడం గమనార్హం. కాబట్టి అమ్మ ప్రస్తుతం ఎన్నికలలో పోటీ పడాలనుకునేవారి శుభ నక్షత్రాలను పరిశీలించి, గెలుపు తథ్యం అని అభ్యర్థుల జన్మకుండలిలో ఉంటే అలాంటి వారికే టికెట్ ఇవ్వడానికి అమ్మ(విప్లవనాయకి జయలలిత) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. |