ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ర్యాగింగ్ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ర్యాగింగ్ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం
హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం సంచలనం సృష్టించిన ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. కాంగ్రా జిల్లాలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రభుత్వ వైద్యకళాశాలలో కచ్రూ అనే మెడికో ర్యాగింగ్ భూతానికి బలైన సంగతి తెలిసిందే. సీనియర్లు విపరీతంగా కొట్టడంతో ఆదివారం రాత్రి టాండాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కచ్రూ కన్నుమూశాడు.

జమ్మూకు చెందిన అమర్ కచ్రూ (19) ఈ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా రెండో సంవత్సరానికి చెందిన సీనియర్లు ఈ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. ఇదిలా ఉండగా విద్యార్థి మృతిపై హిమాచల్ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనపై అధికారి యంత్రాంగం న్యాయవిచారణకు ఆదేశించింది. కళాశాల ప్రిన్సిపల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరోవైపు వైద్య కళాశాల హాస్టల్ మేనేజర్, వార్డెన్, ఇద్దరు గార్డులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలీసులు విద్యార్థి మృతికి సంబంధించి నలుగురు విద్యార్థులను అరెస్టు చేసినట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఒరిస్సా ప్రభుత్వం బలపరీక్ష నేడే
ప్రతివారికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు..సోనియా
జన్మకుండలి చూపండి..టికెట్ పొందండి
ధరల పెరుగుదల అంశమే కాంగ్రెస్‌ను ఓడిస్తుంది
మతస్వేచ్ఛ దుర్వినియోగంపై పీఎం ఆందోళన
అణు ఒప్పందంలో కీలక పాత్రధారి మీనన్