ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > వైద్యవిద్యార్థి ర్యాగింగ్ కేసు: నలుగురిపై హత్య అభియోగాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వైద్యవిద్యార్థి ర్యాగింగ్ కేసు: నలుగురిపై హత్య అభియోగాలు
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థి ర్యాగింగ్ మరణంపై పోలీసులు మరో నలుగురు వైద్య విద్యార్థులపై హత్య అభియోగాలు నమోదు చేశారు. తాండా పట్టణంలోని రాజేంద్రప్రసాద్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చిత్రహింసలకు గురిచేయడంతో అమన్ కచ్రూ (19) అనే మెడికో మృతి చెందిన సంగతి తెలిసిందే.

సీనియర్లు తీవ్రంగా కొట్టడంతో, కచ్రూ ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ యువకుడిని ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలు పెట్టిన ఆరోపణలపై నలుగురు వైద్య విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై తాజాగా హత్య అభియోగాలు నమోదు చేశామని బుధవారం పోలీసులు వెల్లడించారు. ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు.

ముకుల్ శర్మ, అభినవ్ వర్మ అనే ఇద్దరు విద్యార్థులు మంగళవారం ధర్మశాల కోర్టులో లొంగిపోయారు. వీరిద్దరూ మార్చి- 16 వరకు పోలీసు కస్టడీలో ఉండనున్నారు. మరో ఇద్దరు అజయ్ వర్మ, నవీన్ వర్మలు శుక్రవారం వరకు తమ కస్టడీలో ఉంటారని కాంగ్రా ఎస్పీ అతుల్ కుమార్ తెలిపారు.

ప్రధాన నిందితుల్లో ఒకరు కళాశాల సీనియర్ ప్రొఫెసర్ కుమారుడని పోలీసులు చెప్పారు. తలకు బలమైన దెబ్బతగలడం కచ్రూ మరణానికి ప్రధాన కారణమైందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్‌కు చురుకైన యువతీ యువకులు కావలెను
మైనారిటీలో పడిన మేఘాలయ ప్రభుత్వం
విశ్వాస తీర్మానం నెగ్గిన నవీన్ పట్నాయక్
తృతీయ కూటమిలో చేరలేదు: బీజేడీ
ర్యాగింగ్ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం
ఒరిస్సా ప్రభుత్వం బలపరీక్ష నేడే