సీట్ల పంపిణీని దాదాపుగా పూర్తి చేసిన తరణంలోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మరోసారి కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటుపై చర్చించడానకి సిద్ధంగా ఉన్నామన్నారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కోరుకుంటే చర్చలు జరిపేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామన్నారు.
పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని ములాయం సింగ్ యాదవ్ మంగళవారం విలేకరులతో చెప్పారు.
కాంగ్రెస్- ఎస్పీ సీట్ల సర్దుబాటు వివాదంపై ఆయన మాట్లాడుతూ.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. దీనికి సంబంధించిన నిర్ణయం ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం చేతుల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు. |