ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > నేను పాక్‌లోని ఫరీద్‌కోట్ వాసిని: అజ్మల్ కసబ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేను పాక్‌లోని ఫరీద్‌కోట్ వాసిని: అజ్మల్ కసబ్
ముంబై ఉగ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన ఏకైక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు తాను పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాకు చెందినవాడినని అంగీకరించాడు. ముంబై దాడులకు సంబంధించి తొలి రోజు విచారణ సందర్భంగా కసబ్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.

గత ఏడాది నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడులు దేశ ఆర్థిక రాజధానిలో భయానక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు 180 మంది ప్రాణాలు బలిగొన్న ఈ దాడులపై సోమవారం కోర్టు విచారణ ప్రారంభమైంది. ముంబైలోని ఆర్థూర్ రోడ్ జైలులో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కేసు విచారణ జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేశారు.

దాడులపై విచారణ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ విచారణ సందర్భంగా తాను పాకిస్థానీయుడనని అంగీకరించిన కసబ్, తనకు న్యాయవాదిని ఏర్పాటు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. ప్రత్యేక న్యాయమూర్తి ఎంఎల్ తహిలియానీ ఎదుట వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కసబ్ విచారణలో పాల్గొన్నాడు. అతడిని అదే కోర్టు జైలులో హైసెక్యూరిటీ సెల్‌లో ఉంచారు.

విచారణలో కోర్టు న్యాయమూర్తి నీ తరపున వాదించేందుకు న్యాయవాది కావాలా అని అడిగిన ప్రశ్నకు కసబ్ సమాధానిమిస్తూ.. విచారణ అనేది ఉంటే, తనకు న్యాయవాది కావాలని పేర్కొన్నాడు. న్యాయవాది ఏర్పాటు విషయంలో ప్రాధాన్యతలు ఏవైనా ఉన్నాయా అని అడుగ్గా, తన తరపున నవంబరు 27న విచారణలో పాల్గొన్న న్యాయవాదిని రప్పించగలరా అని కసబ్ ప్రశ్నించాడు.

అయితే ఇప్పటివరకు న్యాయవాదులెవరూ నీ తరపున పాల్గొనలేదని కోర్టు అతనికి తెలియజేసింది. సమ్మతమైతే ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని సూచించింది. అందుకు కసబ్ కూడా అంగీకరించాడు. న్యాయమూర్తి తహిలియానీ నేను మీకు తెలుసా అని అడుగ్గా, తెలియదని చెప్పాడు.

నేను నీ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి అని తహిలియానీ తెలిపారు. అందుకు కసబ్ చిరునవ్వు చిందించి, అనంతరం న్యాయమూర్తికి నమస్తే చెప్పాడు. కసబ్‌తో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్ విచారణకు ఈ రోజు తొలిసారి మీడియాను కూడా అనుమతించారు. కోర్టు ముంబై దాడుల కేసు విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రోజే తీర్పు వెల్లడించాల్సి ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ముంబై ఉగ్రవాద దాడుల విచారణ ప్రారంభం
నానో వెళ్ళినందుకు బాధపడుతున్నాం: బుద్ధదేవ్
బీసీసీఐ మమ్మల్ని సంప్రదించలేదు: హోంశాఖ
లాలూ కలియుగ దుర్యోధనుడు...కాంగ్రెస్
ఫిలిబిత్‌ అభ్యర్థి వరుణ్ గాంధీయే: భాజపా
తొలి దశ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన రాష్ట్రపతి