ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > సౌమ్య హత్య కేసును ఛేదించిన ఢిల్లీ పోలీసులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సౌమ్య హత్య కేసును ఛేదించిన ఢిల్లీ పోలీసులు
టీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్, ఐటీ ఉద్యోగిని జిగీషా ఘోష్‌ల హత్య కేసులను ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం ప్రకటించారు. జీగీషా హత్యకు వాడిన ఆయుధాన్నే సౌమ్యా హత్యకు కూడా వాడారని, ఈ రెండు హత్యలు ఒకరే చేసినట్లు సాక్ష్యాలు దొరికాయని పోలీసులు తెలిపారు.

సౌమ్యా విశ్వానాథన్ హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్య కోసం వారు ఉపయోగించిన ఆయుధాలతోపాటు, వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అరెస్టు అయినవారిని రవి, బల్జీత్, అమిత్, అజయ్‌లుగా గుర్తించారు. గత ఏడాది సెప్టెంబరు 30న ఢిల్లీలో సౌమ్యా విశ్వనాథన్ హత్యకు గురైయ్యారు.

జీగీషా ఘోష్ మార్చి 19న ఫరీదాబాద్‌లో హత్య చేయబడ్డారు. డబ్సు కోసమే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. జిగీషాను హత్య చేసినవారు అనంతరం ఆమె ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేశారు. ఏటీఎం సెంటర్‌లో ఉన్న సీసీ కెమేరాలతో వారి ఫొటోలు రికార్డయ్యాయి. వీటి సాయంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వీరిని పట్టుకోవడంతో సౌమ్యా హత్య కేసు మిస్టరీని కూడా పోలీసులు ఛేదించగలిగారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దేశంలో రాజకీయ స్థిరత్వం కావాలి: ప్రధాని
పేదలకు రూ.3కే కేజీ బియ్యం: కాంగ్రెస్
ఈసీ పక్షపాత వైఖరి: వరుణ్ గాంధీ
అగ్రవర్ణాలకు పెద్దపీట వేసిన భాజపా-కాంగ్రెస్: మాయ
తృతీయ, భాజపా కూటమిలకు మద్దతివ్వం: తృణమూల్
తమ్ముడూ..భగవద్గీతను చదువు: ప్రియాంక