ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > నాపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత: జగదీష్ టైట్లర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత: జగదీష్ టైట్లర్
త్వరలో జరగబోతున్న లోక్‌సభ ఎన్నికలకు తనను దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ యూనిట్‌లోని ఓ వర్గం బాగా ప్రయత్నించిందని జగదీష్ టైట్లర్ ఎన్డీటీవీతో చెప్పారు. సిక్కుల వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ జగదీష్ టైట్లర్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సీబీఐ ఇటీవల జగదీష్ టైట్లర్, సజ్జన్ కుమార్‌లకు క్లీన్‌చిట్ ఇవ్వడంపై సిక్కు వర్గంలో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికి నిరసన తెలిపేందుకు రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి పి.చిదంబరంపై ఓ సిక్కు జర్నలిస్ట్ బూటు విసిరాడు.

ఈ సంఘటనను తనను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ నేతలు బాగా ఉపయోగించుకున్నారని టైట్లర్ చెప్పారు. తనను ఎన్నికలకు దూరంగా ఉంచేందుకు ఈ సంఘటన వారికి బాగా ఉపయోగపడిందన్నారు. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్నవారి మద్దతు అకాలీలు పొందారని ఆరోపించారు. ఇది అకాలీల పని మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. అయితే దీనికి సంబంధించి తానెవరి పేరు ప్రస్తావించాలనుకోవడం లేదన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
క్షమించమని వేలసార్లు అడుగుతున్నా: టైట్లర్
ప్రధానమంత్రి పదవి నాకూ కావాలి: శరద్ పవార్
సిక్కుల మనోభావలను గుర్తించాం..చిదంబరం
ఎన్నికల నుంచి తప్పుకున్న టైట్లర్
అతివిశ్వాసం వద్దు: ఎల్‌కే అద్వానీ సూచన
టైట్లర్ కేసు: వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు