ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > నాలుగో దశ ఎన్నికలు: నోటిఫికేషన్ విడుదల
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాలుగో దశ ఎన్నికలు: నోటిఫికేషన్ విడుదల
నాలుగో దశ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ దశలో 85 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. 15వ లోక్‌సభ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మూడు దశల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. శనివారం నాలుగో దశ పోలింగ్‌కు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ దశ పోలింగ్ మే 25వ తేదీన పోలింగ్ జరుగుతుంది. మొత్తం 85 సీట్లకు గాను రాజస్థాన్‌లో 25 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 18, పశ్చిమబెంగాల్‌లో 17, హర్యానాలో 10, ఢిల్లీలో 7, పంజాబ్‌లో 4, బీహార్‌లో మూడు, జమ్మూకాశ్మీర్‌లో ఒక సీటుకు చొప్పున పోలింగ్ జరుగుతుంది. నాలుగో దశకు 11వ తేదీ నుంచే నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 18వ తేదీతో దాఖలు గడువు ముగుస్తుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు: 12 మంది మృతి
మేమెవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: మన్మోహన్
విచ్ఛిన్న శక్తులకు అవకాశం ఇవ్వొద్దు: సోనియా
యూపీఏ విభేదాలు మాకు లాభం: అద్వానీ
నాపై కాంగ్రెస్‌లోనూ వ్యతిరేకత: జగదీష్ టైట్లర్
క్షమించమని వేలసార్లు అడుగుతున్నా: టైట్లర్