ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > భాజపాకు మద్దతివ్వండి: అద్వానీ లేఖ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భాజపాకు మద్దతివ్వండి: అద్వానీ లేఖ
ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగుతున్న తరుణంలో తన నాయకత్వానికి మద్దతివ్వాల్సిందిగా కోరుతూ భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కే.అద్వానీ దేశంలోని వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులకు ఓ లేఖ రాశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై అన్ని మతాల నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఈ లేఖలో పేర్కొన్న అద్వానీ మత గురువులతో సంప్రదింపుల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

హిందూ మతానికి చెందిన బాబా రామ్‌దేవ్, శ్రీశ్రీ రవిశంకర్ తదితరులతో పాటు ముస్లీం మతానికి చెందిన మౌలానా వయిహుద్దీన్, వివిధ చర్చిల అర్చిబిషప్‌లు సహా మరో వేయిమంది మతాచార్యులకు అద్వానీ ఈ లేఖలు రాయడం విశేషం. ఇలా వివిధ మతాలకు చెందిన గురువులకు రాసిన లేఖలో అద్వానీ 12 ముఖ్యమైన హామీలను ఇచ్చారు.

ఉత్తరాన వైష్ణోదేవి ఆలయం, దక్షిణాన తిరుమల శ్రీవారి ఆలయాల తరహాలోనే సర్వ మతాలకు చెందిన ప్రధాన పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తామని, భక్తులకు అన్ని వసతులు అక్కడ కల్పిస్తామని ఆయన తెలిపారు. దీంతోపాటు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని సైతం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని ఆయన తన హామీల్లో వెల్లడించారు.

దీంతోపాటు పొరుగు దేశాలతో భారత్‌కు ముప్పు పొంచివున్న నేపథ్యంలో వారితో వ్యవహరించే విధానంలోనూ ఆధ్యాత్మిక గురువుల సలహాలను తాము తీసుకుంటామని అద్వానీ పేర్కొన్నారు. అలాగే గత కొన్నేళ్లుగా దేశంలో ఆధ్యాత్మిక వారసత్వం ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురయ్యిందని పేర్కొన్న ఆయన తాము అధికారంలోకి వస్తే అన్ని మతాల ప్రధాన పుణ్యక్షేత్రాలను సుందరీకరిస్తామంటూ హామీ ఇచ్చారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇది సంకీర్ణ ప్రభుత్వాల శకం: ప్రణబ్ ముఖర్జీ
మోడీపై విమర్శలు గుప్పించిన ప్రియాంక
నేను కసబ్ తల్లిని.. అతడిని చూడాలి
పాక్‌తో సత్సంబంధాలు నెలకొల్పుతాం: ఎస్పీ
నాలుగో దశ ఎన్నికలు: నోటిఫికేషన్ విడుదల
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు: 12 మంది మృతి