ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కాంగ్రెసే అసలైన మతతత్వ పార్టీ: అరుణ్ శౌరి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాంగ్రెసే అసలైన మతతత్వ పార్టీ: అరుణ్ శౌరి
భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీ అంటూ ప్రచారం చేసే కాంగ్రెసే.. అసలు సిసలు మతతత్వ పార్టీ అని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్‌శౌరి ధ్వజమెత్తారు. దేశంలోని అందర్నీ సమానంగా చూడాల్సింది పోయి ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీయే మతతత్వ పార్టీగా ముద్రవేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో బీజేపీ మిత్రులు అనే పేరుతో మేధావులతో ఏర్పాటైన కార్యక్రమంలో అరుణ్‌శౌరి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు. అద్వానీ దేశానికి ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోందని, అయితే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు దేశానికి ఏం చేశారో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ఈ వేదిక నుంచి పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ తరహాలో ప్రస్తుతం బీజేపీ ఉందని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ విభజన ముందు ఉన్న ముస్లీంలీగ్ తరహాలో ఉందంటూ విమర్శించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మతవాద శక్తులతో శాంతికి విఘాతం: సోనియా
భాజపాకు మద్దతివ్వండి: అద్వానీ లేఖ
ఇది సంకీర్ణ ప్రభుత్వాల శకం: ప్రణబ్ ముఖర్జీ
మోడీపై విమర్శలు గుప్పించిన ప్రియాంక
నేను కసబ్ తల్లిని.. అతడిని చూడాలి
పాక్‌తో సత్సంబంధాలు నెలకొల్పుతాం: ఎస్పీ