ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మా దేశ న్యాయవాదే కావాలి: కసబ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మా దేశ న్యాయవాదే కావాలి: కసబ్
గత ఏడాది ముంబై ఉగ్రవాద దాడుల సందర్భంగా భద్రతా దళాలకు పట్టుబడిన తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్ తన తరపున వాదించేందుకు పాకిస్థాన్ చెందిన న్యాయవాదినే నియమించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ముంబై దాడుల కేసులో ఓ సాక్షి తరపున వాదిస్తున్న విషయాన్ని అంజలీ వాఘ్మేరా తమ దృష్టికి తీసుకురానందుకు ఆమె కసబ్ తరపున వాదించేందుకు కోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో తన తరపున వాదించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేయాల్సిందిగా పాకిస్థాన్ అధికారిక యంత్రాంగానికి విజ్ఞప్తి చేసేందుకు అనుమతించాలని కసబ్ కోర్టును కోరాడు. పాకిస్థాన్ ప్రభుత్వం న్యాయవాదిని ఏర్పాటు చేయకపోవచ్చని కోర్టు పేర్కొనగా, కసబ్ ఇంకొకసారి ప్రయత్నించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. కసబ్ కోరికపై పాక్ అధికారిక యంత్రాంగానికి ఈ విజ్ఞప్తిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
దేశ వ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ప్రారంభం
వామపక్షాలతో చెలిమి చెదిరిపోదు: మన్మోహన్
ఆర్ఎస్ఎస్‌‌కు బానిసగా అద్వానీ: సోనియా ధ్వజం
అంజలీ వాఘ్మేరాను తొలగించిన ముంబై కోర్టు
దేశ అభివృద్ధికి ప్రాంతీయ పార్టీలే అడ్డంకి: పీఎం
"మున్నాభాయ్‌"పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు