భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి లాల్ కృష్ణ అద్వానీ మీడియా ప్రసంగంలో కొన్ని నిమిషాలపాటు ఒసామా బిన్ లాడెన్ పేరుకు బదులు ఒబామా బిన్ లాడెన్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకున్న అద్వానీ పాత్రికేయులతో తాను పొరపాటున ఒసామా బిన్ లాడెన్ పేరును ఒబామా బిన్ లాడెన్‌గా చెప్పినట్లు తెలియజేశారు.
నల్లధనంపై భాజపా టాస్క్ ఫోర్స్ నివేదికలోని అంశాలను పాత్రికేయులకు చదివి వినిపిస్తున్న సమయంలో అద్వానీ పొరపాటున ప్రపంచ ఉగ్రవాది పేరును ఒబామా బిన్ లాడెన్‌గా చదివారు.
ఆయన మాటల్లోనే, "నల్లధనం దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టు. అంతేకాదు కొన్ని అసాంఘిక శక్తులు నల్లధనాన్ని ఉపయోగించి ఘోరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సెప్టెంబరు 11 దాడుల తర్వాత అమెరికా తెలుసుకుంది. ఒబామా బిన్ లాడెన్ వంటివారు నల్లధనాన్ని విదేశీ బ్యాంకులలో దాచి ప్రపంచంపై బాంబు దాడులకు తెగబడుతున్నారు" అన్నారు.
ఆ తర్వాత పొరపాటును గ్రహించిన అద్వానీ, తన ప్రసంగంలో ఒసామాకు బదులు ఒబామా పేరను చదివానని విలేకరులకు తెలిపారు. |