ముంబయిపై తీవ్రవాదుల దాడి సందర్భంగా ప్రాణాలతో పట్టబడిన అజ్మల్ అమీర్ కసబ్‌పై శుక్రవారం ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధానికి దిగడంలాంటి ఆరోపణలతో భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కసబ్‌పై నిందారోపణ చేశారు.
దీంతోపాటు కసబ్ ఏడు నేరాల్లో ప్రధాన నిందితుడిగాను, మరో ఐదు కేసుల్లో సహ కుట్రదారుడిగానూ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ప్రాసిక్యూషన్ తరపున నేతృత్వం వహించారు.
విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబయిపై దాడుల సందర్భంగా తీవ్రవాదులు అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్‌కు చెందిన వ్యక్తులపై ప్రత్యేకంగా గురిపెట్టారని అన్నారు.
తద్వారా దేశంపై యుద్ధానికి దిగి జమ్మూ,కాశ్మీర్‌లను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. ముంబైపై తీవ్రవాదులు జరిపిన ఈ దాడిలో పాకిస్థాన్ సైన్యం పాత్రకూడా ఉందని ఆయన కోర్టుకు వివరించారు. |