ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కసబ్‌ను ప్రజలమధ్య ఉరి తీయండి: బాల్ థాకరే
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కసబ్‌ను ప్రజలమధ్య ఉరి తీయండి: బాల్ థాకరే
FILE
ముంబై దాడులకు పాల్పడి ప్రాణాలతో పట్టుబడ్డ తీవ్రవాది ముహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌పై ఎలాంటి న్యాయ విచారణ చేపట్టకుండా గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో కసబ్‌ను ప్రజల మధ్య ఉరి తీయాలని శివసేన ప్రముఖుడు బాల్ థాకరే వెల్లడించారు.

శివసేనకు చెందిన పత్రిక "సామ్నా" పత్రిక సంపాదకీయంలో బాల్ థాకరే స్పందిస్తూ...కసబ్‌కు న్యాయ సహాయం ఎందుకు కల్పించాలని ప్రశ్నిస్తూ, ప్రజలమధ్య గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో అతన్ని ఉరి తీయాలని ఆయన సూచించారు. ఇలా చేస్తే సమయం వృధాకాదనికూడా ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం కసబ్‌ను ఓ అతిథిలాగా చూస్తోందని ఆయన ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు. తన కుమారుడిని చూడటానికి వస్తున్న కసబ్ తల్లిని ఓ అమరుడి తల్లికి ఇచ్చే గౌరవం ఆమెకు కల్పిస్తున్నారనికూడా ఆయన ఎద్దేవా చేశారు.

ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం కసబ్‌తో వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారని, ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని ఆయన అభివర్ణించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉపాధ్యాయుడి కిరాతక దండన: బాలిక బలి
అణు ఒప్పందంపై పునరాలోచన: ఏచూరి
కసబ్‌పై ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభం
ఒబామా(ఒసామా) బిన్ లాడెన్: నోరు జారిన అద్వానీ
నేడు 5వ విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ
నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం: తెల్గీకి ఏడేళ్ల శిక్ష