ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మాయాపై వ్యాఖ్యలు: దత్‌కు నోటీసులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాయాపై వ్యాఖ్యలు: దత్‌కు నోటీసులు
బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో సినీనటుడు సంజయ్‌దత్‌కు నోటీసులు జారీచేయబడ్డాయి. ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంజయ్‌దత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన ప్రతాప్‌గఢ్ జిల్లా మేజిస్ట్రేట్ ఈ నోటీసులు జారీ చేశారు.

ఈ విషయమై మేజిస్ట్రేట్ పింకీ జోవల్ మాట్లాడుతూ ఏప్రిల్ 17న ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కారణంగా దత్‌కు నోటీసులు జారీచేశామని తెలిపారు. దత్ చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలను కించపర్చేలా ఉన్నాయని మేజిస్ట్రేట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఎస్పీ తరపున లోక్‌సభ బరిలో నిలిచిన అక్షయ్ ప్రతాప్ సింగ్ తరపున ప్రచారంలో పాల్గొన్న దత్ శుక్రవారం ప్రతాప్‌గఢ్‌లోని కేపీ హిందూ కళాశాల మైదానంలో జరిగిన సభలో మాట్లాడుతూ తమ అభ్యర్ధికి అవకాశం ఇస్తే ప్రతాప్‌గఢ్ ప్రజలకు మ్యాజికల్ కౌగిలింత, ముద్దు ఇస్తారని అలాగే ముఖ్యమంత్రి మాయావతికి సైతం ఇస్తారని అన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కసబ్‌ను ప్రజలమధ్య ఉరి తీయండి: బాల్ థాకరే
ఉపాధ్యాయుడి కిరాతక దండన: బాలిక బలి
అణు ఒప్పందంపై పునరాలోచన: ఏచూరి
కసబ్‌పై ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభం
ఒబామా(ఒసామా) బిన్ లాడెన్: నోరు జారిన అద్వానీ
నేడు 5వ విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ