ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > తుది సమరంలో రాహులే విజేత: ప్రియాంక
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తుది సమరంలో రాహులే విజేత: ప్రియాంక
FileFILE
అమేథీలో పోలింగ్‌ తక్కువగా నమోదైనప్పటికీ, రాహుల్‌ గాంధీ సునాయాసంగా విజయం సాధిస్తారని ఆయన సోదరి ప్రియాంకా గాంధీ జోస్యం చెప్పారు. అమేథీలోని కొన్ని గ్రామాల ప్రజలు ఏకమొత్తంగా పోలింగ్‌ను బహిష్కరించడంపై ఆమె పైవిధంగా వ్యాఖ్యానించారు.

ఈ చర్య రాహుల్‌పై ఉత్పన్నమైన వ్యతిరేకత అయివుండదని తాను అభిప్రాయపడుతున్నట్లు ప్రియాంక తెలిపారు. అంతిమంగా ప్రజలు చాలా తెలివైన వారని, ఓటు వేయనందుకు కూడా వారు సహేతుక కారణంగా చెబుతారని అన్నారు. అమేథీలో ఒకవేళ రాహుల్‌ గెలవకపోతే అప్పుడు మీడియా తనను ప్రశ్నించవచ్చని సమాధానం ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అమేథీ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌కు సోదరి ప్రియాంక విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే. రాహుల్‌తో పాటు తల్లి సోనియా పోటీ చేస్తున్న రాయబరేలీలోనూ ప్రియాంక ప్రచారం నిర్వహించారు. అయితే ప్రియాంక ప్రచారం చేసిన గ్రామాలు ఓటింగ్‌కు గైర్హాజరు కావడం, ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడం కొసమెరుపు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అల్లర్లపై సారీ చెప్పే ప్రసక్తే లేదు: నరేంద్ర మోడీ
తీవ్రవాదంపై కఠిన చర్యలు: మన్మోహన్ సింగ్
కసబ్ వయస్సు నిర్ధారణపై ప్రత్యేక కోర్టు ఆదేశం
అద్వానీ తర్వాత మోడీ ప్రధాని: అరుణ్ శౌరీ
అఫ్జల్ ఉరితీత వల్ల కాంగ్రెస్‌కు నష్టం లేదు
బీహార్: మావోయిస్టుల దాడిలో ఐదుగురి మృతి