తృతీయ కూటమితో లేదా లెఫ్ట్ పార్టీలతో పొత్తును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ తోసిపుచ్చింది. ఎన్నికల తరువాత తృతీయ కూటమితో పొత్తుకు తాము ప్రయత్నించబోమని స్పష్టం చేసింది. తమ చిరకాల ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వారితో ఉన్న కారణంగా, తాము తృతీయ కూటమితో చేతులు కలపబోమని తేల్చిచెప్పింది. అయితే కాంగ్రెస్‌తో పొత్తుకు మాత్రం ద్వారాలు తెరిచే ఉంచుతామని తెలిపింది. యూపీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తృతీయ కూటమిలో ఉన్నంతవరకు తాము వారితో పొత్తు పెట్టుకోబోమని, అదే విధంగా సీపీఎంతోనూ ఎటువంటి సంబంధాలు ఉండవని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ విలేకరులతో చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. |