సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరుగుతున్న మూడో దశ ఎన్నికల ప్రక్రియలో పలువురు నేతలు బరిలో ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని 26 పార్లమెంట్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో గాంధీ నగర్ నుంచి అద్వానీ (భాజపా), సురేష్ పటేల్ (కాంగ్రెస్), మల్లికా షరాభాయ్ (ఇండిపెండెంట్)లు పోటీ పడుతున్నారు.
అలాగే, శంకర్ సింఘ్ వాఘేలా (కాంగ్రెస్), ప్రభాత్ సింగ్ చౌహాన్ (భాజపా), సత్య జిత్ గ్వైకాడ్ (కాంగ్రెస్), బాలకృష్ణ శుక్లా (భాజపా)లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 17 లోక్‌సభ సీట్లకు జరుగుతున్న పోలింగ్‌లో రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు. ఆమెపై ఖుష్వా (బీఎస్పీ), ఆర్బీ.సింగ్ (భాజపా)లు పోటీ చేస్తున్నారు.
అలాగే, లక్నో నుంచి అఖిలేష్ దాస్ గుప్తా (బీఎస్పీ), లాల్జీ టాండన్ (భాజపా), రీటా బహుగుణ జోషి (కాంగ్రెస్), నఫీషా ఆలీ (ఎస్పీ)లు బరిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింథియా (కాంగ్రెస్), నరోత్తమ్ మిశ్రా (భాజపా), సుమిత్రా మహాజన్ (భాజపా) సంత్రాయణ్ పటేల్ (కాంగ్రెస్), నరేంద్ర సింగ్ సింగ్ తమోర్ (భాజపా), రామ్ నివాస్ రావత్ (కాంగ్రెస్)లు బరిలో ఉన్నారు.
అలాగే కర్ణాటక రాష్ట్రంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కూడా ఎన్నికల బరిలో ఉన్నారు. వీరితో పాటు మరికొంత మంది భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. |