ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > బాబ్రీ కేసులో కళ్యాణ్ సింగ్ దోషి: మంత్రి లాలూ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాబ్రీ కేసులో కళ్యాణ్ సింగ్ దోషి: మంత్రి లాలూ
FileFILE
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌పై కేంద్ర రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కళ్యాణ్ సింగ్ దోషి అని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో జరిగిన ఒక సభలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆయన (కళ్యాణ్) దోషి. ఆయన సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు కాదు. అసలు ఇలాంటి వ్యక్తి ఎస్పీ సభ్యుడా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీని ఓడించాలని ముస్లిం ప్రజలకు కళ్యాణ్ సింగ్ పిలుపునివ్వడంపై లాలూ విమర్శలు గుప్పించారు.

సార్వత్రిక ఎన్నికల సమరానికి కొద్ది రోజులు ముందుగా కళ్యాణ్ సింగ్ ఎస్పీ తీర్థం పుచ్చుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా కళ్యాణ్ సింగ్ ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఒరిస్సాలో గ్రీష్మ తాపానికి 78 మంది మృతి
మన్మోహన్ సింగ్‌కు మద్దతిస్తాం: మమతా బెనర్జీ
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ రోగి: ఆస్పత్రిలో చేరిక
బెంగాల్‌లో "మార్పు"కు ప్రధాని మన్మోహన్ పిలుపు
చీకటి పాలన సాగించిన ఎన్డీయే: సోనియా
కాశ్మీర్‌లో ముగిసిన 50 గంటల సమ్మె