బీహార్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. బీహార్‌లోని సరేన్ జిల్లా సోనిపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారని పోలీసులు వెల్లడించారు.
వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ కారును లారీ ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారని వారు తెలిపారు.
లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఇంకా ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. |