ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > బాబ్రీ కూల్చివేత నాకు తెలియదు: కళ్యాణ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాబ్రీ కూల్చివేత నాకు తెలియదు: కళ్యాణ్
బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర తనకు తెలియకుండానే జరిగిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తనకు తెలియకుండా దీనికి కుట్రపన్నిందని ఆరోపించారు. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే.

బీజేపీ నేతలు తనపై పన్నిన కుట్ర ఇదని కళ్యాణ్ సింగ్ ఆరోపించారు. తనను తొలగించేందుకు జరిగిన కుట్ర ఇదన్నారు. బాబ్రీ కూల్చివేత గురించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. బాబ్రీ కూల్చివేత అనంతరం తాను బీజేపీలో తిరుగుబాటు నేతగా మారానని, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని తెలిపారు.

డిసెంబరు 6, 1992న అయోధ్యలోని 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదును హిందూ కార్యకర్తలు కూల్చివేశారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. బాబ్రీ కూల్చివేత అనంతరం ఉత్తర భారతదేశంలో పెద్దఎత్తున మత ఉద్రిక్తతలు చెలరేగాయి. బీజేపీ నేతలు ఆ సమయంలో ఏమీ జరగదని తనకు హామీ ఇచ్చినట్లు కళ్యాణ్ చెప్పారు. బీజేపీ నేతలు మసీదును కూల్చివేయమని తనకు హామీ ఇచ్చారని, తాను వారిని నమ్మానని తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లెఫ్ట్‌తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమే: మన్మోహన్ సింగ్
బీహార్‌లో రోడ్డుప్రమాదం: 8మంది సజీవ దహనం
ప్రియాంకాకు జరిమానా
ఆసుపత్రిలో చేరిన కరుణానిధి
కసబ్ వయోజనుడే: ప్రత్యేక కోర్టు
భారత్‌లోని ఆరుగురికి స్వైన్ ఫ్లూ లేదు