నిరుడు జరిగిన ముంబై దాడుల కేసులో ప్రత్యక్ష సాక్షులను ముంబై కోర్టులో శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రాణాలతో పట్టుబడ్డ ఏకైక తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానంలో ప్రత్యక్ష సాక్షులు అలనాడు జరిగిన మారణకాండపై సాక్ష్యమిస్తున్నారు. వారి సాక్ష్యాలను కోర్టు రికార్డు చేస్తోంది.
ఇదిలావుండగా అతి కిరాతకుడైన కసబ్ ఏకే-47తో ఏఎస్ఐ తుకారామ్ ఓమ్బ్‌లేను కాల్చి చంపాడని, దీనిని తాను ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసానని భాస్కర్ కదమ్ పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్(పీఎస్ఐ) కోర్టుకు తెలిపారు. కాగా కసబ్‌తోబాటు మరో తీవ్రవాదిని జీపులో తీసుకువచ్చిన వారుకూడా కోర్టుకు తమ వాంగ్మూలం వినిపించినట్లు సమాచారం. |