తన వద్ద ఉన్న రసాయన ఆయుధాలను భారత్ ధ్వంసం చేసింది. అంతర్జాతీయ ఒప్పందం మేరకు భారత్ ఈ చర్య తీసుకుంది. దీంతో అంతర్జాతీయ ఒప్పందం మేరకు రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన మూడో దేశంగా భారత్ గుర్తింపు పొందింది.
రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన తర్వాత ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి భారత్ తెలియజేసింది. ఈ సందర్భంగా రసాయన ఆయుధాల నిరోధక సంస్థ (ఓపీసీడబ్ల్యూ) ప్రతినిధి మైఖేల్ లుహాన్ మాట్లాడుతూ భారత్ తన రసాయన ఆయుధాలను నాశనం చేసినట్టు ధృవీకరించారు.
భారత్‌కు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు రసాయన ఆయుధాలను పెద్ద ఎత్తున కలిగివున్న నేపథ్యంలో భారత్ తన ఆయుధాలను నాశనం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతోపాటు పాక్‌లోని తీవ్రవాదంతో భారత్‌కు పెనుముప్పు సైతం పొంచివున్న సంగతి కూడా తెలిసిందే. |