కేంద్ర హోంమంత్రిగా పళనియప్పన్. చిదంబరం రెండవసారి పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్‌తోబాటు 19మంది మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిన విషయం విదితమే. ఇందులో హోంమంత్రిగా ఆయన సోమవారం పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇదిలావుండగా నిరుడు ముంబైలో జరిగిన దాడుల నేపథ్యంలో అప్పటి హోంశాఖమంత్రిగానున్న శివరాజ్ పాటిల్ రాజీనామా చేయడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరానికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అంతకు మునుపు ఆయన ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించేవారు. కాగా ప్రస్తుతం ఆయన రెండవ సారి హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. |