కేంద్రంలో కొత్తగా ఏర్పాటయిన యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం పూర్తి రూపు సంతరించుకుంది. రాష్ట్రపతి భవన్‌లోని అశోక్ హాలులో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గురువారం ఉదయం 59 మంది మంత్రులచే ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త యూపీఏ ప్రభుత్వంలో 78 మంత్రులు బాధ్యతలు స్వీకరించినట్లయింది.
తాజా మంత్రి మండలి విస్తరణతో కొత్త ప్రభుత్వంలో మొత్తం 33 మంది మంత్రులు, ఏడుగురు సహాయమంత్రులు (స్వతంత్రహోదా), 38 మంది సహాయ మంత్రులు కొలువుతీరారు. ఈసారి మూడో వంతు పదవులను కాంగ్రెస్ నేతలు చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 59 మంది నేతలు మంత్రి పదవులు దక్కించుకోగా, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు చెరో ఏడు పదవులు, ఎన్సీపీకి మూడు, ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్ చెరొక పదవి పొందాయి.
గురువారం ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర మంత్రులు: ఎం. రామచంద్రన్, వి. నారాయణస్వామి, జ్యోతిరాదిత్య మాధవరావు సింథియా, దగ్గుబాటి పురంధరేశ్వరి, కె.హెచ్. మునియప్ప, అజయ్ మకెన్, పనబాక లక్ష్మి, నమో నారాయణ్ మీనా, ఎం.ఎం. పల్లంరాజు, సౌగత్ రాయ్, ఎస్.పి. పళని మాణిక్యం, జితిన్ ప్రసాద్, ఎ.సాయిప్రతాప్, గురుదాస్ కామత్, హరీష్ రావత్, కె.వి. థోమస్, భగత్‌సింగ్ పోలంకి, మహదేవ్ ఖండేలా, దినేష్ త్రివేది, శిశిర్ అధికారి, సుల్తాన్ అహ్మద్, ముకుల్ రాయ్, మోహన్ జతువా, డి. నెపోలియన్, ఎ.జగద్రక్షన్, ఎస్. గాంధీ సెల్వన్, ప్రణీత్ కౌర్, తుషార్‌బాయ్ చౌదరి, సచిన్ పైలెట్, అరుణ్ యాదవ్, ప్రదీప్ ప్రకాష్ బాపు పాటిల్, ఆర్.పి.ఎన్. సింగ్, శశిథరూర్, విన్సెంట్ పల, ప్రదీప్ జైన్, అగాథా సంగ్మా, మల్లిఖార్జున ఖార్గే, కుమారి సెల్జా, శుభోద్ కాంత్ సహాయ్, డాక్టర్ ఎం.ఎస్. గిల్, జి.కె. వాసన్, పావన్ కుమార్ బన్సాల్, ముఖుల్ వాస్‌నిక్, కాన్షిలాల్ బూరియా, ఎం.కె. ఆళగిరి, ప్రఫుల్ పటేల్, పృథ్వీరాజ్ ఛవాన్, శ్రీ ప్రకాష్ జైశ్వాల్, సల్మాన్ ఖుర్ఫిద్, ధిన్షా పటేల్, కృష్ణా తిరథ్, జైరామ్ రమేష్, శ్రీకాంత్ జెనా, ఇ. అహ్మద్, వీరభద్రసింగ్ (హిమాచల మాజీ ముఖ్యమంత్రి), ఫరూఖ్ అబ్దుల్లా (జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి), విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ (మాహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి), దయానిధి మారన్ (మాజీ ఐటీ శాఖ మంత్రి), ఏ. రాజా (మాజీ ఐ.టి. శాఖ మంత్రి). |