బాలీవుడ్ వర్ధమాన నటుడు షైనీ అహుజా కామానికి బలైన పనిమనిషి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. షైనీ తనపై ఎలా అత్యాచారం చేశాడో పూసగుచ్చినట్టు వివరించింది. ముఖ్యంగా, అత్యాచారం చేసిన తర్వాత అర్థ గంట వరకు స్పృహలోకి రాలేక పోయానని వివరించింది.
తాను సెక్స్‌కు అంగీకరించక పోవడంతో తనపై చేయి చేసుకుని, చేతులను వెనక్కి నొక్కిపట్టి బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నాడని, ఆ నొప్పికి భరించలేక కేకలు వేసినట్టు తన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో తన ప్రైవేట్ పార్ట్స్ (మర్మాంగాలు) నొప్పిగా ఉన్నాయని వివరించింది.
ఇదే విషయాన్ని పోలీసు అధికారులు కూడా నిర్థారించారు. వైద్య పరీక్షల నివేదికలో కూడా అత్యాచారం చేసినట్టు చెప్పారు. అలాగే, యువతి ఇచ్చిన వాంగ్మూలంలోని పలు విషయాలను వారు బయటకు వెల్లడించారు. అత్యాచారానికి గురైన పనిమనిషి తొలుత నాగ్‌పడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. ఆతర్వాత వైద్య పరీక్షలు కూడా యువతి అత్యాచారానికి గురైనట్టు నిర్థారించాయని పోలీసులు వెల్లడించారు.
బలవంతంగా సెక్స్‌లో పాల్గొనటం వల్ల యువతి ప్రైవేట్ పార్ట్స్‌కు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయని వివరించారు. అయితే, శరీరంపై మాత్రం గాయాలు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం మూర్ఖంగా ప్రవర్తించిన అహుజా చేతులను వెనక్కి నొక్కిపెట్టి, అత్యాచారం చేశాడు. దీంతో ఆమె మర్మావయావాల్లో తీవ్ర నొప్పిని ఎదుర్కొందన్నారు. బలత్కారం చేసిన తర్వాత యువతి అర్థగంట పాటు పైకి లేవలేక పోయిందని పోలీసులు వివరించారు. |