జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఆరంభమైన అమర్‌నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా గురువారం జమ్ము నుంచి ప్రారంభంకావాల్సిన యాత్ర కూడా తాత్కాలికంగా రద్దు అయింది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో భారీగా వర్షం కురుస్తుండటం, దీనికి తోడు మంచు బాగా పడుతుండటంతో భక్తుల యాత్రకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా యాత్ర ఏమాత్రం ముందుకు సాగడం లేదు. కొత్త భక్తుల బ్యాచ్‌లను భగవతి నగర్ నుంచి అమర్‌నాథ్ దేవాలయానికి పంపించడం లేదని అమర్‌నాథ్ ఆలయ బోర్డు అధికారులు వెల్లడించారు. కాగా, మూడు రోజుల క్రితం ఆరంభమైన యాత్ర నుంచి ఇప్పటి వరకు కేవలం 900 మంది యాత్రికులు మాత్రమే జమ్ము నుంచి బాల్‌తాల్‌కు వెళ్లగలిగినట్టు యాత్రా నిర్వాహకులు తెలిపారు. |