ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > దేశవ్యాప్తంగా 63కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశవ్యాప్తంగా 63కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు
దేశంలో కొత్తగా మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. దేశ రాజధానిలో తాజాగా మరో ఇద్దరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని అదుపు చేసేందుకు బహుముఖ వ్యూహాన్ని పాటించామని, అది సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీలో కొత్తగా రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవగా, పూణే, ముంబయి నగరాల్లో మిగిలిన రెండు కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి దేశ రాజధానికి వచ్చిన 25 ఏళ్ల వ్యక్తికి ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే కెనడా నుంచి వచ్చిన 29 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు.

తాజాగా నమోదయిన రెండు కేసులతోసహా, దేశ రాజధానిలో నిర్ధారణకు వచ్చిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 26కి చేరింది. అమెరికా నుంచి పూణే వచ్చిన 24 ఏళ్ల యువకుడిలోనూ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. అతనికి వ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి ముంబయికి వచ్చిన 23 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని అధికారులు తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నాపై పోలీసు స్టేషనులో అత్యాచారం చేశారు: మహిళ ఫిర్యాదు
బెంగాల్‌లో మూడు జిల్లాలపై బంద్ ప్రభావం
విజయంవతంగా సాగుతున్న లాల్‌గఢ్ ఆపరేషన్
పదవి కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదు: సిన్హా
స్వైన్ ఫ్లూపై బహుముఖ వ్యూహం: కేంద్రం
కాంగ్రెస్‌ విషయంలో లాలూ వైఖరేంటి: నితీష్‌