ప్రపంచ దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోంది. గురువారం కొత్తగా మరో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక కేసు దేశ రాజధానిలోనే వెలుగుచూడగా, గూర్గావ్‌లో రెండు కేసులు బయటపడ్డాయి.
అహ్మదాబాద్‌లో ఓ జర్మనీ పౌరుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జర్మన్ పౌరుడిపై అధికారిక వర్గాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా గూర్గావ్‌లో ఇద్దరు వ్యక్తులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. మిగిలిన మూడు కొత్త కేసులను ఢిల్లీ, పూణే, కోల్‌కతా నగరాల్లో గుర్తించారు.
గూర్గావ్‌లో లండన్ నుంచి వచ్చిన 19 ఏళ్ల యువకుడికి, న్యూయార్క్ నుంచి వచ్చిన 10 ఏళ్ల బాలికకు స్వైన్ ఫ్లూ సోకినట్లు అధికారిక వర్గాలు గురువారం నిర్ధారణకు వచ్చాయి. మియామీ నుంచి ఢిల్లీకి వచ్చిన ఆరేళ్ల బాలికకు స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. |