దేశంలో పది కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద ఉన్నాయి. హోంశాఖకు పది కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి డిమాండ్‌లు వచ్చాయని అధికారిక వర్గాలు తెలిపాయి. వీటిలో బీహార్‌లో మిథిలిలాంచల్ అనే ోకొత్త రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ కూడా ఉంది.
దీనితోపాటు గుజరాత్‌లో సౌరాష్ట్ర, కర్ణాటకలో కూర్గ్ ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్రాలగా ప్రకటించాలని డిమాండ్‌లు వచ్చాయని హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన డిమాండ్‌లన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి, గోర్ఖా జనముక్తి మోర్చా, మరికొన్ని ఇతర సంస్థలు, వ్యక్తుల వద్ద నుంచి వచ్చాయని హోంశాఖ అధికారి తెలిపారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను కలిపి బుందేల్‌ఖంఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా హోంశాఖ వద్ద చాలాకాలం నుంచి ఉంది. పది కొత్త రాష్ట్రాల డిమాండ్‌లపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సిఫార్సులు పంపలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సులు తప్పనిసరి అయిన సంగతి తెలిసిందే. |