విదేశాలకు వెళుతున్న భారతీయుల ఉపయోగార్థం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక డేట్ బ్యాంకు ప్రాజెక్టు చేపట్టింది. విదేశాల్లో ఇటీవల కొందరు భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరిగిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళుతున్న భారతీయుల వివరాలను ఈ డేటా బ్యాంకులో పొందుపరుస్తారు.
ఇటువంటి ప్రాజెక్టు చేపట్టం ఇదే తొలిసారి. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడంతో డేటా బ్యాంకు రూపకల్పన కోసం శ్రీకారం చుట్టారు. ఇటీవల ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా 17 హింసాత్మక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో విదేశాల్లో ఉంటున్న భారతీయల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. |