దేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. కొత్తగా మరో తొమ్మిది స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్ధారించబడిన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 89కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు.
ప్రభుత్వం స్వైన్ ఫ్లూ నియంత్రణ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ, విదేశాల నుంచి వస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలో మరో తొమ్మిది మంది చేరారు. తాజా కేసుల్లో నాలుగు బెంగుళూరులో బయటపడగా, మరో నాలుగు ఢిల్లీలో, పంజాబ్‌లో ఒక స్వైన్ ఫ్లూ కేసును గుర్తించారు. |