గత ఏడాది నవంబర్ మాసం 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు ముంబైలోని స్థానికులు సహకరించి ఉంటారని బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ న్యూస్ ఛానెల్ అనుమానం వ్యక్తం చేసింది. ముంబైలోని స్థానికుల సహకారంతోనే ఉగ్రవాదులు రెచ్చిపోయి ఉంటారని, ముంబైలోని లష్కరే తొయిబా విభాగానికి చెందిన సభ్యులు పాక్‌లోని తీవ్రవాద నాయకులుకు సమాచారం అందించి ఉంటారని బీబీసీ వార్తా ఛానెల్ తెలియచేసింది. దీనికి సంబంధించిన కథనాన్ని సోమవారం రాత్రి ప్రసారం చేయనున్నట్లు బీబీసీ న్యూస్ నైట్ కరస్పాండెంట్ రిచర్డ్ వాట్సన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ పత్రికతో మాట్లాడుతూ... స్థానిక పోలీసులు, కమెండోల కదలికలపై స్థానికులు పాక్‌లోని తమ అగ్రనాయకులకు సమాచారం ఇస్తే, వారు అక్కడినుంచి ఇక్కడున్న తీవ్రవాదులకు సమాచారం చేరవేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రసారాన్ని సోమవారం రాత్రి ప్రసారం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. |