బీహార్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమస్తిపురా డివిజన్‌లోని ఒరఖ్‌పూర్-నర్కతియాగంజ్ సెక్షన్‌లో రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ చంప్రారణ్ జిల్లాలో ఈ బ్రిడ్జి కూలింది.
ఖైర్పూఖ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక చిన్నపాటి రైలు వంతెన ఆదివారం రాత్రి కూలిపోయింది. ఫలితంగా ఈ మార్గంలో నడిచే రైలు రాకపోలకు అంతరాయం ఏర్పడినట్టు బగాహా స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ లలిత్ కుమార్ ఎక్కా తెలిపారు.
అంతేకాకుండా, ఈ భారీ వర్షాలకు బఘా అండ్ ఖైర్పూక్రా రైల్వే స్టేషన్ మార్గ మధ్యంలో కిలోమీటర్ దూరం మేరకు రైలు కట్ట కొట్టుకుని పోయింది. దీంతో సప్తక్రాంతి సూపర్ ఫాస్ట్, జాన్ నాయక్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నిలిపి వేశారు. అంతేకాకుండా పలు రైళ్ళను ఖైర్పూక్రా రైల్వే స్టేషన్ నుంచి గోరఖ్‌పూర్, సమస్తిపూర్‌ల మీదుగా మళ్లించారు. |