ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > సిబాల్ ఎడ్యుకేషన్ సూత్రాన్ని తోసిపుచ్చిన భాజపా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సిబాల్ ఎడ్యుకేషన్ సూత్రాన్ని తోసిపుచ్చిన భాజపా
సిబాల్ ఇటీవల సూచించిన సింగిల్ బోర్డు పరీక్షా పద్ధతిని భాజపా పాలిత రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులు తోసిపుచ్చారు. పిల్లలపై ఒత్తిడి పడకుండా చూడాల్సిన బాధ్యత నిజమేననీ, అయితే సిబాల్ చెప్పినట్లుగా గుడ్డెద్దు చేలో పడ్డట్లు ఏదిబడితే అది అనుసరించడం సాధ్యం కాదన్నారు.

ఈ సందర్భంగా మాజీమంత్రి మురళీ మనోహర్ జోషీ మాట్లాడుతూ, ఇటువంటి సూచనలను చేసేముందు సిబాల్ విద్యావేత్తలను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులేమైనా చేయదలచుకున్నప్పుడు దానిపై లోతుగా కసరత్తు చేయాలనీ, విద్యా రంగంలోని నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు... ఇలా అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని జోషి అన్నారు.

ఈ సమావేశంలో ఎన్డీఎ కన్వీనర్ శరద్ యాదవ్, మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, భాజపా పాలిత రాష్ట్రాల విద్యామంత్రులు పాల్గొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు: హోంశాఖ
భగ్గుమన్న బారాముల్లా: నలుగురి మృతి
కంధమాల్ నుంచి కేంద్ర బలగాల ఉపసంహరణ
మమత రైల్వే బడ్జెట్‌లో ఛార్జీల పాక్షిక సవరణ
ఎన్ఎస్‌జీ హబ్‌లలో ఆర్మీ ప్రత్యేక దళాలు
ఎంపీ మందాను వివరణ కోరిన అధిష్టానం : మెయిలీ