ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మందా జగన్నాథంకు సోనియా సమన్లు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మందా జగన్నాథంకు సోనియా సమన్లు
బ్యాంకు మేనజర్‌పై చేయిచేసుకున్న నాగర్‌‍కర్నూల్ ఎంపీ మందా జగన్నాథానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఓ గ్రామీణ బ్యాంకు మేనజర్‌పై చేయిచేసుకుంటూ మందా జగన్నాథం టీవీ కెమేరాల కంట్లో పడటంతో పెద్దఎత్తున దుమారం రేగింది. ఓ పార్లమెంట్ సభ్యుడు ఇటువంటి చర్యకు పాల్పడటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ వ్యవహారంపై స్పందించినట్లు తెలుస్తోంది. జరిగినదానిపై వివరణ ఇవ్వాలని పార్టీ ఎంపీ జగన్నాథంకు సోనియా సమన్లు జారీ చేసినట్లు సమాచారం. మేనేజర్‌ను జగన్నాథం కొట్టడంపై పార్టీ అధిష్టానం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ఎంపీ ప్రవర్తనపై రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని వివరణ కోరారు.

జరిగిన సంఘటన విచారకరమని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలపై చర్యలు తీసుకునేందుకు పార్టీలో వ్యవస్థ ఉందని, దీనిపై నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే మందా జగన్నాథం మేనేజర్‌పై చేయిచేసుకున్నందుకు గురువారం బేషరతు క్షమాపణ చెప్పారు. మరోవైపు ఆయనపై ఈ వ్యవహారానికి సంబంధించి క్రిమినల్ కేసు కూడా నమోదు అయింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్వలింగ సంపర్కం చట్టబద్ధమే: ఢిల్లీ హైకోర్టు
ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక సర్వే
గోద్రా కేసు: నిందితులకు బెయిల్ నిరాకరణ
బారాముల్లా నుంచి సీఆర్పీఎఫ్ ఉపసంహరణ
సిబాల్ ఎడ్యుకేషన్ సూత్రాన్ని తోసిపుచ్చిన భాజపా
పశ్చిమ తీరానికి తీవ్రవాద ముప్పు: హోంశాఖ