స్వలింగ సంపర్కానికి చట్టబద్దత కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై అఖిల భారత ముస్లిం లా బోర్డు తీవ్రంగానే మండిపడింది.
మానవాళికి ముప్పు తెచ్చేది స్వలింగ సంపర్కమని, మనిషి తన భవిష్యత్‌ను తానే నాశనం చేసుకునేలా కోర్టు తీర్పు చెప్పడం సరికాదని ముస్లిం లా బోర్డు సభ్యులు అంటున్నారు.
ఇలాంటి చట్టాల వలన మానవ జాతి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని లా బోర్డు సభ్యులు వాపోయారు.
ఇదిలావుండగా కోర్టు తీర్పు పూర్తిగా తెలిసిన తర్వాతే తాను స్పందిస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ తెలిపారు.
కాగా స్వలింగ సంపర్కానికి చట్టబద్దత కల్పిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై మతతత్వ పార్టీ అయిన బీజేపీ తన అభిప్రాయం తెలిపేందుకు నిరాకరించినట్లు సమాచారం. |