అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల నిందితుడిని మధ్యప్రదేశ్ తీవ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. అతని పేరు మొహమ్మెద్ ఇర్ఫాన్ అలియాస్ కరేలీ. ఇతడిని మధ్యప్రదేశ్ రాజధాని నగరం బోపాల్‌లోని కర్నాడ్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
అహ్మదాబాద్, ఇతర నగరాల్లో సంభవించిన 17 వరుస బాంబు పేలుళ్ల కేసుల్లో ఇతను నిందితుడు. నిషేధిత సిమి సంస్థకు స్లీపర్ సెల్ ఏర్పాటు చేసేందుకు కరేలీ ఇక్కడి వచ్చాడని అందిన సమాచారంపై పోలీసులు సకాలంలో స్పందించారు. ఇద్దరు తన అనుచరుల కోసం కర్నాడ్ నగరంలోని కర్నాడ్ ప్రదేశంలో కరేలీ వేచిచూస్తున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్ పోలీసులతోపాటు, జోధ్‌పూర్ పోలీసులు కూడా కరేలీ కోసం అన్వేషిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు సహకరించినవారికి రూ.15 వేల నగదు బహుమతి కూడా ప్రకటించబడి ఉంది. |