న్యాయమూర్తుల ఆస్తులను ప్రజాసమక్షంలో పెట్టాల్సిన అవసరం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. న్యాయమూర్తులను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని, ఇది కక్షిదారులకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని పేర్కొన్నారు.
న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆస్తుల వివరాలను కోర్టు రిజిష్ట్రార్‌కు అందజేస్తారు. వాటిని ప్రజలందరి ముందు వెల్లడించాల్సిన అవసరం లేదని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల ఆస్తులను తప్పనిసరిగా బహిరంగపరిచేలా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానున్నట్లు న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల ప్రకటించారు.
ఈ ప్రకటనపై కేజీ బాలకృష్ణన్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతిని రూపుమాపడానికి న్యాయమూర్తుల ఆస్తులను బహిర్గతం చేయాలనే డిమాండ్ చాలాకాలం నుంచి వినిపిస్తోంది. |