మన భారతదేశానికి దేశీయ రైల్వే మంత్రి ఎప్పుడు లభిస్తారో...? ఇది ప్రతిసారి తలెత్తుతున్న ప్రశ్న. గత 13 సంవత్సరాలుగా చూస్తే బీహార్ రాష్ట్రంనుంచి లోక్‌సభకు ఎన్నికైనవారే రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రధానంగా పెద్ద పెద్ద ప్రణాళికలన్నీకూడా బీహార్ ప్రాంతానికే తరలిపోయాయి. తాజాగా చూస్తే ప్రస్తుత రైల్వే శాఖామంత్రిణి మమతాబెనర్జీకూడా మంత్రిగా బాధ్యతలు తీసుకుని తన రాష్ట్రంలోని కోలకతానుంచే పనిని ప్రారంభించారు. దీంతో ప్రతి ఒక్కరుకూడా ఆమె పశ్చిమ బెంగాల్‌కు ఎంతమాత్రం స్థానం కల్పిస్తారో వేచిచూడాల్సిందేనని అంటున్నారు. శుక్రవారం ఆమె ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్లో పశ్చిమ బెంగాల్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మమతా పార్టీకి ఎంతమేరకు లాభం చేకూరుతుందనేది ప్రశ్నార్థకం. మమత దీదీ తన రాష్ట్ర ప్రజలకు ఏమేరకు స్థానం కల్పిస్తారో వేచిచూడాల్సిందే. కాని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి మమత దీదీ రైల్వే మంత్రిగా ఎన్నికైయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కోలకతాతోపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలకు ఆమె తన రైల్వే బడ్జెట్‌లో కొంతమేరుకు ఉపయోగపడేలా ఉంటుందోనని ఆ రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుండగా ఈ సారి బీహార్ రాష్ట్ర ప్రజలు ఉదాసీనంగా ఉండారు. ఎందుకంటే గత 13సంవత్సరాలుగా చాలామార్లు బీహార్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి కొంతమేరకు మేలు చాసారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి రాదేమోననేది వారి భాధ. |