ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > దేశంలో 116కు చేరుకున్న స్వైన్ ఫ్లూ కేసులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశంలో 116కు చేరుకున్న స్వైన్ ఫ్లూ కేసులు
దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 116కు చేరుకుంది.

ఇన్ఫ్లూయెంజా-ఏ ఎన్1హెచ్1. అంటే స్వైన్ ఫ్లూ అన్నమాట. గురువారం రాత్రికి మరో నలుగురు స్వైన్ ఫ్లూ బాధితులను కనుగొన్నారు. దీంతో దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న బాధితుల సంఖ్య 116కు చేరుకుంది. వీరిలో 80మంది రోగులను ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

దేశంలోని పూణే, బెంగళూరు, కొచ్చిన్ మరియు గుర్‌గాంవ్ ప్రాంతాలలో చెరి ఒక స్వైన్ ఫ్లూవ్యాధితో బాధపడుతున్నవారిని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖాధికారి ఒకరు తెలిపారు. దీంతో దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న బాధితుల సంఖ్య 116కు చేరుకుంది. వీరిలో 80మందిని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 793 మందిని పరీక్షించినట్లు ఆయున తెలిపారు.

కొత్తగా నలుగురు స్వైన్ ఫ్లూ అనుమానితుల్లో గుర్‌గాంవ్‌కు చెందిన ఆరు సంవత్సరాల బాలిక ఉండటం గమనార్హం. ఆ బాలిక జూన్ నెల 27వ తేదీన అమెరికానుంచి భారతదేశానికి వచ్చిందని ఆయన తెలిపారు.

మరో కేసు బెంగుళూరులో నమోదైందని, అక్కడ నాలుగు సంవత్సరాల బాలికకు స్వైన్ ఫ్లూవ్యాధి బారిన పడిందని ఆయన తెలిపారు. ఈ అమ్మాయి జూన్ నెల 30వ తేదీన అమెరికానుంచి భారత్‌లోని బెంగుళూరుకు చేరుకుంది.

మూడవ కేసు పూణేలో నమోదైంది. ఇందులో 34సంవత్సరాల మహిళ అమెరికానుంచి హాంగ్‌కాంగ్ మీదుగా ముంబైకి జూన్ నెల 27వ తేదీన చేరుకున్నారు.

నాలుగవ కేసుగా కొచ్చిలో నమోదైంది. ఇందులో 69సంవత్సరాల మహిళ ఉండటం గమనార్హం. ఆమె జూన్ నెల 29వ తేదీన టోరంటో నుంచి కొచ్చికి వచ్చారని ఆయన వివరించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానించినవారిలో 793మంది ఉన్నారు. వీరిలో 116మందికి స్వైన్ ఫ్లూ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖాధికారి తెలిపారు.

దేశంలోని ప్రముఖ 22 అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఇప్పటివరకు 49వేల 73మంది యాత్రికులకు పరీక్షలు నిర్వహించినామని, వీరిలో 35వేల 85మంది యాత్రికులు స్వైన్ ఫ్లూ బాధిత దేశాలనుంచి భారతదేశానికి వచ్చినవారని అధికారి పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
తొలి స్వైన్ ఫ్లూ మరణం: కేరళలో నమోదు
ఇది ప్రజల బడ్జెట్: లోక్‌సభలో మమతా బెనర్జీ
దేశానికి దేశీయ రైల్వేమంత్రి ఎప్పుడు లభిస్తారో...?
జడ్జిల ఆస్తులు బయటపెట్టాల్సిన అవసరం లేదు
నేడు లోక్‌సభలో మమత రైల్వే బడ్జెట్