ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > తన అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నా: అహుజా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తన అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నా: అహుజా
FILE
తాను పనిమనిషిపై అత్యాచారం జరపలేదని, ఆమె అంగీకారంతోనే తనతో శృంగారంలో పాల్గొన్నానని బాలీవుడ్ నటుడు అహుజా వెల్లడించారు.

తన ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు తన ప్రతిష్టను దిగజార్చి, డబ్బులు గుంజడానికే తనను అత్యాచారం కేసులో ఇరికించారని అతను ఆరోపించారు. పనిమనిషిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ముంబై సెషన్స్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. తాను పనిమనిషిపై అత్యాచారం చేయలేదని, ఇది ఆమె అంగీకారంతోనే జరిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన శరీరంపై చిన్నపాటి గోళ్ళ గుర్తులుండటంతో అత్యాచారమని ఎలా చెపుతారని ఆయన ప్రశ్నించారు.

శృంగారంలో ఇలాంటి గాయాలు సహజమేనని ఆయన పేర్కొన్నారు. తాను జైలులో ఉండటంమూలాన తన సినిమాలు చాలావరకు నిలిచిపోయాయని, దీంతో సదరు నిర్మాతలు, దర్శకులు, తోటి నటులు ఇబ్బందులకు గురౌతున్నారని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదిలావుండగా దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.వి. కిని వాదిస్తూ... ఇలాంటి దశలో బెయిల్ మంజూరు చేస్తే విచారణపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు.

కాగా డీఎన్ఏ, వైద్య పరీక్షల ఆధారంగా అహుజాపై పోలీసులు బలమైన కేసును నమోదు చేశారని, చార్జిషీటు దాఖలు చేసేదాకా ఆయనను బెయిల్‌పై విడుదల చేయరాదనిఆయన కోర్టును కోరినట్లు సమాచారం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లాలూ బడ్జెట్‌ తప్పుల తడక: మమతా బెనర్జీ
ఆం.ప్రకు న్యాయం చేస్తాం: మునియప్ప
స్వలింగ సంపర్కం ఓ మానసిక రుగ్మత: రాందేవ్
కంధమాల్ అల్లర్లకు మతమార్పిడిలే కారణం
దేశంలో 116కు చేరుకున్న స్వైన్ ఫ్లూ కేసులు
మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు