జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని గురెజ్ సెక్టార్ ప్రాంతంలో ఆరు తీవ్రవాదులు మృత దేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృత దేహాలతో పాటు ఆరు ఏకే-47 తుపాకులను కూడా కైవసం చేసుకున్నట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి. గత మార్చి నెలలో భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు తీవ్రవాదులు ప్రయత్నించారు.
అయితే, వారు మంచు పర్వతాల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలినట్టు పేర్కొన్నారు. తీవ్రవాదులు మూడు నెలల క్రితం మృతి చెందినట్టు గుర్తించారు. వాతావరణం అనుకూలించక, మంచు ఎక్కువగా పడుతుండటంతో మృతదేహాలను కనుగొనలేక పోయారు.
తాజాగా చేపట్టిన గాలింపు చర్యల్లో తీవ్రవాదుల మృతదేహాలను గుర్తించినట్టు స్వాధీనం చేసుకున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉత్తర కాశ్మీర్ ప్రాంతం నుంచి దట్టమైన పొగమంచు, భారీ వర్షాలకు తట్టుకుని భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చేందుకు అవసరమైన సహాయ సామాగ్రి, దస్తులను కలిగి ఉన్నారని వర్గాలు పేర్కొన్నాయి. |