అమర్‌నాథ్ యాత్రకు మరోమారు బ్రేక్ పడింది. పహల్గామ్ మార్గంలో మంచు ఎక్కువగా పడుతుండటంతో యాత్రను జమ్ము నుంచి శనివారం నిలిపివేశారు. వాతావరణం అనుకూలించని కారణంగా జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్రను నిలిపి వేస్తున్నట్టు అమర్‌నాథ్ ఆలయ బోర్డు అధికారులు తెలిపారు.
ఈ మేరకు స్థానిక అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టు బోర్డు అధికారులు వెల్లడించారు. దీంతో పహల్గామ్‌లోని నున్వాన్ ఏర్పాటు చేసిన యాత్రికుల శిబిరంలో రద్దీని తగ్గించేందుకు ఈ శిబిరానికి కొత్తగా భక్తులను అనుమతించడం లేదు. కాశ్మీర్ లోయలో వాతావరణం అనుకూలించక అమర్‌నాథ్ యాత్రను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన విషయం తెల్సిందే. |