ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ప్రధాని సలహా సంఘంలో అమర్త్యసేన్-మిట్టల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రధాని సలహా సంఘంలో అమర్త్యసేన్-మిట్టల్
కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైన సలహా సంఘంలో ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్‌కు చోటు కల్పించారు. అలాగే, వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్, పెప్సికో సీఈఓ ఇంద్రనూయీతో పాటు.. మరికొంత మంది మేధావులు ఉన్నారు.

అంతర్జాతీయ సలహా సంఘం (గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్)గా వ్యవహించే ఈ సలహా మండలి దేశానికి, విదేశాల్లో ఉన్న భారతీయ మేధావులకు మధ్య వారధిగా, సమన్వయకర్తగా పని చేస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న ప్రతిభావంతులైన ప్రవాస భారతీయుల సేవలను వినియోగించుకోవడంలో ప్రధానికి సలహాలిస్తుంది.

ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వాయలార్ రవి బుధవారం తెలిపారు. మొత్తం 23 మంది సభ్యులు ఉండే ఈ కమిటీలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎంకృష్ణ, సిటీ గ్రూపు సీఈఓ విక్రమ్ పండిట్, ప్రవాస భారతీయ వ్యాపారదిగ్గజం కరణ్ బిలిమోరియా, విద్యావేత్త శ్యామ్ పిట్రోడా తదితరులు ఉన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్లీజ్, బోర్ కొడుతోంది.. పుస్తకాలు ఇవ్వండి: కసబ్
జమ్ములో విద్యార్థి మృతి: చెలరేగిన ఘర్షణలు
బాలీవుడ్ నటుడు అహుజాకు బెయిల్ నిరాకరణ
గుజరాత్‌లో కల్తీసారాకు 25 మంది మృతి
ప్రాణాలపై ఖైదీ సరబ్జీత్ సింగ్ చివరి ఆశ
వరుణ్‌ ప్రాణానికి ముప్పేమి లేదు: చిదంబరం