మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ల వ్యవహారంపై మరో మారు సుప్రీంకోర్టు మండిపడింది. మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేయకుండా, మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేయటానికి యాజమాన్యాలు ఆసక్తి చూపటంపై చీఫ్ జస్టిస్ లక్షణ్‌లతో కూడిన బెంచ్ తప్పు పట్టింది. ప్రతి సంవత్సరం ఫీజులను పెంచుతూ వైద్యవిద్యను అభ్యసించే విద్యార్ధులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. |