ముంబయి ఉగ్రవాద దాడుల్లో భారత భద్రతా దళాలకు పట్టుబడిన ఒకేఒక్క తీవ్రవాది అజ్మల్ కసబ్ తమ దేశీయుడేనని పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించింది. ముంబయి ఉగ్రవాద దాడుల్లో పట్టుబడిన కసబ్ తమ దేశీయుడేనని పాకిస్థాన్ అధికారికంగా అంగీకరించడం ఇదే తొలిసారి.
ప్రధాని ఈజిప్టు పర్యటనలో పాక్ ప్రభుత్వం ముంబయి దాడులకు సంబంధించి భారత్‌కు 34 పేజీల నివేదికను అందజేసింది. ఈ నివేదికలో కసబ్ తమ దేశీయుడేనని పాక్ అంగీకరించడంతోపాటు, ముంబయి ఉగ్రవాద దాడులకు తమ దేశంలోని ఉగ్రవాద సంస్థలో కుట్రపన్నాయని తెలిపింది.
తమ దేశానికి చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ హస్తం ఉందని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడుల సూత్రధారి లష్కరే చీఫ్ లఖ్వీయేనని వెల్లడించింది.
ముంబయి ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ జమాదుత్ దవా తీవ్రవాద సంస్థలే కారణమని భారత ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల సూత్రధారులను చట్టం ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. |