దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం నాడు జాతీయ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది.
భారత అణు కార్యక్రమంపై మాజీ ఐఆర్‌డిఎ శాస్త్రవేత్త సంతానం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావడం ప్రాథాన్యతను సంతరించుకుంది.
భారత అణుపాటవంతో పాటు భవిష్యత్ వ్యూహాలు, అంతర్గత భద్రతపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో దేశ భద్రతపై తీసుకోవాల్సిన చర్యల గురించి సభ్యులు చర్చించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.